‘మిరాయ్’లో కనిపించని పాటలు.. ఇక అందులోనే..?

Mirai Movie

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ నేడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాకు తొలి ఆట నుంచే సాలిడ్ రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

అయితే, ఈ సినిమాలో పాటలు కనిపించలేదని సినిమా చూసిన వారు డిజప్పాయింట్ అవుతున్నారు. ‘వైబ్ ఉంది’ అనే సాంగ్‌ను ప్రమోషన్స్‌లో రిలీజ్ చేశారు. కానీ, సినిమాలో ఆ పాట కనిపించలేదు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్‌తో కూడా ఓ సాంగ్ ఉందని.. అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ, తీరా సినిమా చూస్తే అందులో ఆ పాట కూడా కనిపించలేదు.

దీంతో ఈ సినిమాలో కేవలం బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఒకట్రెండు సాంగ్స్ తప్ప పాటలు ఎక్కడా కనిపించలేదు. అయితే, సినిమా ఫ్లోకు అడ్డుగా ఉంటాయని మేకర్స్ వాటిని ఎడిటింగ్‌లో కట్ చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ రెండు సాంగ్స్ కూడా ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Exit mobile version