మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి మాతృ వియోగం

లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం మృతి చెందారు. 94 ఏళ్ళ కనకరత్నమ్మ వృధాప్యకారణాలతో మృతి చెందారని తెలుస్తోంది.

అర్ధరాత్రి దాటాక సుమారు 1.45 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం కోకాపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆమె పార్ధివ దేహాన్ని అల్లు అరవింద్ ఇంటికి ఉదయం 9 గంటలకి తీసుకురానున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అల్లు అరవింద్ నివాసానికి చేరుతున్నారు.

రాంచరణ్ మైసూర్ నుంచి, బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకొంటారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు అరవింద్ మరియు చిరంజీవి చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

Exit mobile version