తెలుగులో దుల్కర్ ‘కొత్త లోక’ మార్నింగ్ షోస్ క్యాన్సిల్!

Kotha-Lokah

మళయాళ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన అవైటెడ్ సై ఫై యాక్షన్ చిత్రమే ‘లోకా’. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో రిలీజ్ కి తీసుకొచ్చిన ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి కళ్యాణి ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించగా ప్రేమలు హీరో నెస్లన్ కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మాణం వహించడం విశేషం. మరి ఈ సినిమా మళయాళంలో నిన్ననే రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.

కానీ తెలుగులో నేడు థియేటర్స్ లో మార్నింగ్ షోస్ తో పడాల్సి ఉంది కానీ ఈ మార్నింగ్ షోస్ అనేవి రద్దయ్యాయ్యి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కొత్త లోక షోస్ పడలేదు. దీనితో మేకర్స్ కి ఆడియెన్స్ కి ఒకింత షాక్ గా మారింది. అయితే ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాని దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించారు.

Exit mobile version