సమీక్ష: ‘పరం సుందరి’ – మిస్ ఫైర్ అయ్యిన మ్యూజికల్ డ్రామా

Param Sundari Hindi Movie review

విడుదల తేదీ : ఆగస్టు 29, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, రెంజీ పనికర్, సిద్ధార్థ శంకర్, మంజోత్ సింగ్, సంజయ్ కపూర్ మరియు ఇతరులు
దర్శకుడు : తుషార్ జలోటా
నిర్మాత : దినేష్ విజన్
సంగీతం : సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ : సంతాన కృష్ణన్ రవిచంద్రన్
ఎడిటింగ్ : మనీష్ ప్రధాన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ నుంచి రీసెంట్ గా మంచి బజ్ తో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన హిందీ చిత్రం “పరం సుందరి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన నాన్న లానే మంచి బిజినెస్ మెన్ కావాలనే కోరికతో పరం (సిద్ధార్థ్ మల్హోత్రా) కొన్ని స్టార్టప్ లని స్టార్ట్ చేసి విఫలం అవుతూ వస్తాడు కానీ తన పట్టు వదలడు. ఇలా ఓ రోజు తన నాన్న (సంజయ్ కపూర్) కి ఒక ట్రెండీ ఐడియా చెప్తాడు కానీ దానికి అవసరమైన డబ్బులు ఇచ్చేందుకు తన తండ్రి ఒప్పుకోడు. దీనితో తనని తాను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని పరం సోలోగా ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ జర్నీలో వచ్చిన సుందరి దామోదరం పిళ్ళై (జాన్వీ కపూర్) పరిచయం తర్వాత ఏమైంది? ఇద్దరూ కలిసి ఏం చేస్తారు? పరం అనుకున్న లక్ష్యాన్ని చేరాడా లేదా అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

గత కొన్నాళ్ల కితం బాలీవుడ్ సినిమా నుంచి మంచి మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ ఉండేవి కానీ అలాంటి సినిమాలు రాను రాను తగ్గుముఖం పట్టాయి. అయితే మ్యూజిక్ ట్రీట్ పరంగా మాత్రం పరం సుందరి ఎప్పుడు నుంచో ఆ తరహా సినిమాలు మిస్ అవుతున్న వారికి థియేటర్స్ లో మంచి ట్రీట్ ని అందిస్తుంది అని చెప్పవచ్చు.

సచిన్-జిగర్ ఇచ్చిన సంగీతం సినిమాకి మేజర్ గా ప్లస్ అయ్యింది. కథా కథనాలు కోసం పక్కన పెడితే సంగీతం పరంగా మాత్రం సినిమా మినిమమ్ ట్రీట్ గ్యారెంటీ ఇస్తుంది. అలాగే సినిమాలో మొదటి భాగం కథనం ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ లీడ్ నడుమ కెమిస్ట్రీ బాగుంది. అలాగే అక్కడక్కడా కామెడీ సీన్స్ ఎంగేజ్ చేస్తాయి.

ఇక లీడ్ జంటలో సిద్ధార్థ్ మల్హోత్రా తన చార్మింగ్ లుక్స్ తో మంచి నటనతో ఇంప్రెస్ చేసాడని చెప్పవచ్చు. అలాగే జాన్వీ కపూర్ కూడా మంచి ఫ్రెష్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ కానీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఒక మళయాళీ అమ్మాయిగా జాన్వీ పర్ఫెక్ట్ గా సూటయ్యింది. అంతలా తాను కూడా మారింది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కొంతమేరకు పలు అంశాలు ఓకే కానీ సినిమాలో సరైన ఎమోషన్స్ ఎక్కడా లేవు. ఇది పెద్ద మైనస్ అని చెప్పక తప్పదు. పోనీ ఉన్న కొన్ని సన్నివేశాలు కూడా చూసే ఆడియెన్ పై అంత ఇంపాక్ట్ చూపించేలా కనిపించవు. సంగీతం, కొన్ని కామెడీ మూమెంట్స్ ఎంత నాచురల్ గా అనిపిస్తాయో ఎమోషన్స్ పరంగా కొన్ని సీన్స్ వర్కౌట్ కాలేదు.

అలాగే మెయిన్ లీడ్ నడుమ ట్రాక్ అందులో కొన్ని సీన్స్ అర్ధ రహితంగా అనిపిస్తాయి. హీరో వల్ల హీరోయిన్ కి జరిగిన నష్టం దాని నుంచి ఆమె సింపుల్ గా హీరో లవ్ ని అంగీకరించేయడం వంటివి చాలా సింపుల్ గా అనిపిస్తాయి. ఇక్కడ డెప్త్ మిస్సయ్యింది. అలాగే ఓకే పర్వాలేదు అనుకునే ఫాస్టఫ్ నుంచి సెకండాఫ్ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది.

చాలా వరకు అనవసర ల్యాగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక్కడ ఎడిటింగ్ టీం కొంచెం వర్క్ చేయాల్సింది. అవసరం లేని సీన్స్ తగ్గించి ఉండాల్సింది. ఈ పార్ట్ అంతా అనవసరంగా సాగదీసి వదిలారు. అలాగే సినిమాలో కనిపించే ఇతర నటీనటులకు మరింత స్కోప్ ఇచ్చే అవకాశం ఉంది కానీ దర్శకుడు దానిని వాడుకోలేదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సెటప్ అంతా రిచ్ గా ఎక్కడ ఎలా కావాలో ప్లాన్ చేసుకున్నారు. టెక్నికల్ టీం లో మాత్రం మొదట చెప్పినట్టుగా సంగీతం అదిరింది. పాటలు, స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బానే ఉంది కానీ సెకండాఫ్ లో తేలిపోయింది.

ఇక తుషార్ జలోటా దర్శకత్వం విషయానికి వస్తే.. తన వర్క్ కొంతమేర ఓకే కానీ ఇంకొంతమేర మాత్రం డిజప్పాయింట్ చేశారు. సినిమాని మ్యూజికల్ పరంగా సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నారు. అలాగే డీసెంట్ ఫస్టాఫ్ ని కూడా డిజైన్ చేసుకున్నారు కానీ మూమెంటం సెకండాఫ్ లో మిస్ అయ్యింది. అలాగే ఎమోషన్స్ ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. వీటితో తన వర్క్ కొంతవరకు ఓకే అనిపిస్తుంది అంతే.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘పరం సుందరి’ ఒక రొటీన్ గా సాగే మ్యూజికల్ ట్రీట్ అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ నటీనటులు, ముఖ్యంగా సంగీతం సినిమాలో బిగ్ ప్లస్ అయ్యింది. కానీ వీటికి తగ్గట్టుగానే కథా కథనాలు కూడా ఉండి ఉంటే వాటికి మరింత విలువ ఉండేది. సరైన ఎమోషన్స్ లేకపోవడం ఒక డల్ సెకండాఫ్ సినిమాని పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా మార్చలేకపోయాయి. కేవలం సంగీతం వరకు సినిమాని సేవ్ చేస్తే అద్భుతం అనుకోవాలి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here for English Review

Exit mobile version