‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నిన్న ఈ సినిమా షూట్ చచిరన్ ఫోర్ట్ లో జరిగింది. అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వేసిన సెట్లో ఎక్కువగా షూట్ చేసారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘భాయ్’ సినిమాకి ‘ఆహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో హిట్స్ అందుకున్న వీరభద్రం చౌదరి డైరెక్టర్. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తానని వీరభద్రం ఎంతో నమ్మకంతో ఉన్నాడు. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నాగార్జున తన సొంత బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.