ఘనంగా “మిస్టర్ రాము” మూవీ ఆడియో రిలీజ్

Mr.-Ramu

హైదరాబాద్‌లో “మిస్టర్ రాము” సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. బొంత రాము హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. అజయ్ ఘోష్ విలన్‌గా, జబర్దస్త్ అప్పారావు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ – “మిస్టర్ రాము” సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ అజయ్ కౌండిన్య తనకు మంచి పాత్ర ఇచ్చారని, ఈ చిత్రంలో అజయ్ ఘోష్, చరణ్, హృదయ్ ముగ్దల్ వారి క్రియేటివ్ వర్క్ సినిమా హైలైట్ అవుతుందని చెప్పారు.

ప్రొడ్యూసర్-హీరో బొంత రాము మాట్లాడుతూ – చిన్నప్పటి కల ఇప్పుడు నెరవేరిందని, ఈ సినిమాలో ఆటో డ్రైవర్ పాత్రలో నటించానని చెప్పారు. అజయ్ కౌండిన్యతో కలిపి మొత్తం 10 చిత్రాలు రూపొందిస్తున్నామని ప్రకటించారు.

దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ – సినిమా మెసేజ్‌తో పాటు ఎంటర్టైన్‌మెంట్ కూడా కలిపి తెరకెక్కించామని, ఆసుపత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్‌ల నేపథ్యంతో కథను తీసుకున్నామని తెలిపారు. చిన్న సినిమాలకు కూడా పరిశ్రమలో గుర్తింపు రావాలని కోరుకున్నారు.

Exit mobile version