కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సినీ కార్మికుల సమ్మె ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’ షూటింగ్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి జరగాల్సి ఉండగా, షూటింగ్‌కు తాము వచ్చేది లేదని సినీ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. సమ్మె సమయంలో ఆ సినిమా నిర్మాత TG విశ్వప్రసాద్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసును ఇప్పుడు విత్‌డ్రా చేసుకుంటామని చెప్పినా యూనియన్ నాయకులు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “రాజా సాబ్” సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.