ఈ వారం ఈ సినిమాకే ఛాన్స్.. వినియోగించుకుంటుందా..?

Sundarakanda

ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అయితే, ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. కానీ, ఈ వారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యేవి అన్ని కూడా చిన్న సినిమాలే.

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ వారం బాక్సాఫీస్ దగ్గర నాలుగు చిన్న చిత్రాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. అర్జున్ చక్రవర్తి, త్రిబాణధారి బార్బరిక్, కన్యాకుమారి, సుందరకాండ చిత్రాలు ఈ వారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి.

అయితే, ఈ నాలుగు చిత్రాల్లో నోటెడ్ నటీనటులు ఉన్న చిత్రం కేవలం ‘సుందరకాండ’ మాత్రమే కావడంతో ఈ సినిమాకే ఆడియన్స్ ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సినిమాలోని కంటెంట్‌తో నారా రోహిత్ గనక ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తే, ఈ సినిమా వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

Exit mobile version