మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్‌లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!

Stalin

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అభిమానులను అలరించేందుకు స్టాలిన్ చిత్రాన్ని రీ-రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో రీ-రిలీజ్ చిత్రాలు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. దీంతో స్టాలిన్ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకొని ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ భావించారు.

కానీ, ఈ సినిమా రీ-రిలీజ్‌కు అనుకున్న స్థాయిలో రెస్సాన్స్ దక్కలేదు. ఈ సినిమాలోని కథ బాగున్నా, ప్రేక్షకులు ఎందుకో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిని చూపలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది.

టీవీల్లో వచ్చినప్పుడు ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. కానీ, ఇప్పుడు ఈ మూవీ రీ-రిలీజ్‌కు థియేటర్లలో ప్రేక్షకులు కనీస రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఈ చిత్రం రీ-రిలీజ్‌లో కూడా ఫ్లాప్‌గా నిలిచింది.

Exit mobile version