మగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ మన ‘శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ఎలాంటి సాలిడ్ బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పక్కా కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
అయితే, ఈ సినిమా కోసం ఆయన అన్నీ తానే అనేలా మారుతున్నాడు. ఈ సినిమాను ఎలాంటి డిలే లేకుండా ఒక్క రోజు షూటింగ్ ఎక్కువ కాకుండా పక్కా ప్రణాళికతో తీసుకెళ్తున్నాడు. ఇక అంతేగాక, ఈ చిత్రం కోసం నిర్మాతలకు ఆయన చాలా సేఫ్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలోని నటీనటులు మొదలుకొని టెక్నీషియన్ల వరకు అందరి రెమ్యునరేషన్ విషయంలో అనిల్ రావిపూడి చొరవ తీసుకుని చాలా డీసెంట్ బడ్జెట్ ఖర్చయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ఇలా డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా నిర్మాతలకు కలిసొచ్చేలా పక్కా ప్రణాళికను రచిస్తూ అనిల్ రావిపూడి తనదైన స్ట్రాటెజీతో దూసుకెళ్తున్నాడు.