టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’ కూడా ఒకటి. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుంది. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ దివ్య ఖోస్లా ‘సితార’ అనే పాత్రలో నటిస్తుందని.. ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.
సింపుల్ లుక్‌తో శిల్పాలను పరిశీలిస్తున్నట్లుగా ఆమె పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఇక ఈ పాత్రతో సినిమా కథ ముందుకు సాగుతుందని వారు తెలిపారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేర్న అరోరా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.