విశ్వంభర రిలీజ్ డేట్‌పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, అనేక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దర్శకుడు వశిష్ట మల్లిడి తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రంగా ‘విశ్వంభర’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో కొత్త తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తే మంచి రన్ కొనసాగిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని కంటెంట్, వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని వారు చెబుతున్నారు. మరి ఈసారైనా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version