వరల్డ్ వైడ్ ‘కూలీ’ రికార్డు మేకింగ్ ఓపెనింగ్స్.. తలైవర్ తాండవం

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున అలాగే అమీర్ ఖాన్ ఇంకా ఉపేంద్ర లాంటి స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం రికార్డులు లెక్కలు ఈ సినిమా తేల్చింది.

మేకర్స్ సహా అభిమానులు కూడా చెప్పే మాటగానే రజినీకాంత్ రికార్డు బ్రేకర్ కాదు రికార్డు క్రియేటర్ అనే మాటకి తగ్గట్టుగానే తమిళ సినిమాకి మొదటి 150 కోట్ల ఓపెనింగ్ ఉన్న సినిమాగా కూలీ తో అందించారు. ఈ సినిమా మొదటి రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల గ్రాస్ ని అందుకొని ఇండియన్ సినిమా దగ్గర రేర్ రికార్డు సెట్ చేయగా తమిళ సినిమా నుంచి కూడా మొదటి 150 కోట్ల సినిమాగా కొత్త తలుపులు తెరిచింది. ఇక రెండో రోజు నుంచి వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Exit mobile version