టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వార్ 2, కూలీ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ఈ సినిమాలను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమాలు చూసేందుకు కామన్ ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్లకు వెళ్తున్నారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నాని ఈ రెండు చిత్రాలను చూసేందుకు ఏఎంబి థియేటర్‌కు వెళ్లాడు. అయితే, ఆయన ఈ రెండు సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు ముఖానికి పూర్తిగా మాస్క్ వేసుకుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నాని ప్రస్తుతం తన కొత్త లుక్‌ను రివీల్ కాకుండా ఉండేందుకు ఈ విధంగా ముసుగులో వెళ్లాడనేది అభిమానులు అంటున్నారు. ఇక నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.