‘ఓజి’ ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ కూడా అందుకుంది.

ఇక నెక్స్ట్ ట్రీట్ గా ఈ స్వాతంత్ర దినోత్సవం కానుకగా క్రేజీ అప్డేట్ మేకర్స్ నుంచి ఉంటుంది అని కొన్ని రోజులు నుంచి టాక్ వైరల్ గా మారింది. ఇక దీని కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ డిజప్పాయింటెడ్ న్యూస్ నే అందించారు. ఈ 15న ఎలాంటి అప్డేట్ లేదని ఏమన్నా ఉంటే తామే చెప్తామని తెలిపారు.

మరి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అని కన్ఫర్మ్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ 15న అప్డేట్ లేనట్టే అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version