సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్ అలాగే ఇతర స్టార్ తారాగణం కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమా గత సినిమాలతో లింక్ లేదు అని చెప్పినప్పటికీ అదే రేంజ్ హైప్ లో ఉంది. అయితే ఎక్కడో అభిమానుల్లో మాత్రం దీన్ని కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి లింక్ ఉండే ఉంటుంది అనే భ్రమలో చాలా మంది ఉన్నారు.
ఇక రిలీజ్ ఒక్కరోజు ఉంది అనగా ఈ సినిమాకి వర్క్ చేసిన లోకేష్ కో రైటర్ చేసిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. రచయిత చంద్రు అన్బళగన్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఒక సర్ప్రైజ్ ఉందని అది ఎల్ సి యూ తో లింకా పూర్తిగా వేరే చిత్రమా అనేది థియేటర్స్ నుంచి బయటకి వచ్చాక మీరే తెలుసుకుంటారు అని చెబుతున్నాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మరింత ఆసక్తిగా మారింది.