మెగా ట్రీట్‌లను సిద్ధం చేస్తున్న మెగాస్టార్..?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘మెగా 157’ చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న తన ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ రెండు ట్రీట్స్ రెడీ చేస్తున్నాడట. విశ్వంభర చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఆయన బర్త్ డే రోజున రానుందట. ఇక దీంతో పాటు మెగా 157 చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా అదే రోజు రానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ రెండు అప్డేట్స్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ చేసుకోనున్నారు. మరి ఈ రెండు ట్రీట్‌లు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో చూడాలి.

Exit mobile version