మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి ఈ ఏడాదిలో ఆల్రెడీ భైరవం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన నుంచి మరో సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి ఖరారు అయ్యింది. దర్శకుడు కౌశిక్ పెగాళ్ళపాటి తెరకెక్కించిన యాక్షన్ చిత్రమే “కిష్కింధపురి”. టీజర్ గ్లింప్స్ అలాగే పాటతో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇపుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు.
దీనితో ఈ కొత్త సినిమా రానున్న సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ఎలా అలరిస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ సాలిడ్ హిట్ రాక్షసుడు తర్వాత రెండోసారి జోడి కట్టింది. ఇక రెండో సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. అలాగే ఈ సినిమాని సాహు గారపాటి నిర్మాణం వహించారు.