వైరల్ వీడియో: సోదరితో బాలయ్య రాఖీ పండుగ క్యూట్ సెలబ్రేషన్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం అఖండ 2 దాదాపు పూర్తయ్యిపోయింది. మేకర్స్ నిన్ననే ఓ సాలిడ్ అప్డేట్ ని అందించగా నేడు రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. మరి ఈ పండుగకి నందమూరి అభిమానులకి మంచి ట్రీట్ వీడియో రూపంలో వైరల్ గా మారింది.

బాలయ్య సోదరి ప్రముఖ రాజకీయ నాయకురాలు పురందరేశ్వరితో కలిసి రాఖీ జరుపుకుంటున్న విజువల్స్ వైరల్ గా మారాయి. మరి ఇందులో ఇద్దరు అక్క తమ్ముళ్ల నడుమ క్యూట్ విజువల్స్ ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాయి. దీనితో ఇవి చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య అఖండ 2 సినిమా ఈ సెప్టెంబర్ 25నే గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న విషయం తెలిసిందే.

Exit mobile version