బాక్సాఫీస్: ‘కూలీ’ వసూళ్ల ర్యాంపేజ్.. ఆల్రెడీ భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ!

COOLIE Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కూలీ”. రజినీకాంత్ నుంచి చాలా కాలం తర్వాత వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న సినిమాగా ఇది నిలిచింది. మొత్తం ఇండియా వైడ్ గానే కాకుండా యూఎస్ మార్కెట్ సహా ఇతర ఓవర్సీస్ దేశాల్లో భారీ ఓపెనింగ్స్ ని అందుకునేలా కనిపిస్తుంది.

ఇక ఇండియాలో కూడా కూలీ వసూళ్ల ర్యాంపేజ్ ని బాక్సాఫీస్ దగ్గర చూపించే ఛాన్స్ మెండుగా ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే 20 కోట్లకి పైగా గ్రాస్ ఇండియా వైడ్ కూలీ కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇదే మూమెంటంతో కొనసాగితే డే 1 కే భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనేలా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ క్రేజీ కలయికలో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

Exit mobile version