హృతిక్ ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. చూసుకుందాం అంటున్న కబీర్..!

War2

బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలో తాజాగా హృతిక్ రోషన్ పెట్టిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. హృతిక్ ఇంటి ఆవరణలో ఓ బిల్‌బోర్డ్‌పై ‘వార్-2’ ప్రమోషన్స్ సదడి చేస్తుంది. అయితే, ఆ బిల్‌బోర్డ్‌పై ఎన్టీఆర్ కబీర్ పాత్రకు వార్నింగ్ ఇస్తున్నట్లు ఓ డైలాగ్ ఉంది. దీంతో హృతిక్ కూడా అదే విధంగా స్పందించాడు. ‘ఓకే తారక్.. నువ్వు నా ఇంటి ముందుకు వచ్చి ఇస్తున్న ఛాలెంజ్ నేను అంగీకరిస్తున్నాను.. ఇక చూసుకుందాం..’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య సరదా ఛాలెంజ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై వారిద్దరు ఏ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆగస్టు 14న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version