మన తెలుగు సినిమా దగ్గర భారీ స్టార్డం ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ స్టార్స్ నుంచి రీసెంట్ సినిమాలు హరిహర వీరమల్లు, ఇంకా వార్ 2 సినిమాలు పరిస్థితి ఒకింత ఊహాతీతంగానే ఉందని చెప్పాలి.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాల పరిస్థితి దాదాపు ఒకేలా కనిపిస్తుంది అనే కామెంట్స్ ఉన్నాయి. పవన్ నుంచి చాలా కాలం తర్వాత ఓ స్ట్రైట్ సినిమా.. అలాగే ఎన్టీఆర్ నుంచి తన మొదటి బాలీవుడ్ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ప్రీ సేల్స్ లో అంతగా ప్రభావం చూపించకపోవడం అనేది ఒకింత ఆశ్చర్యంగా కనిపిస్తుంది.
అయితే వీరికి ముందు యూఎస్ మార్కెట్ లో పట్టు లేదా అంటే భారీ రికార్డు ఓపెనింగ్స్ వీరి పేరిట ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు సినిమాల విషయంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం ఒకింత చర్చగా మారింది. వీరమల్లు ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో రన్ కంప్లీట్ చేసేసుకుంది. వార్ 2 ఇంకా రిలీజ్ కి దగ్గరకి వస్తుంది. దీని ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.