నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ మేనియా.. చెప్పులు విడిచి సినిమాకి

mahavatar-narasimha

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది యానిమేషన్ చిత్రం “మహావతార్ నరసింహ” అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ గా కన్నడ కంటే తెలుగు, హిందీలోనే ఈ సినిమా భారీ వసూళ్లు అందుకొని క్రేజీ రెస్పాన్స్ ని చూపిస్తుంది. అయితే హిందీలో మాత్రం జనం మరో లెవెల్లో చూస్తున్నారని చెప్పాలి.

అక్కడ చాలా థియేటర్స్ లో ఈ సినిమా షోకి వెళ్లే ముందు థియేటర్ దగ్గరే చెప్పులు విడిచి లోపలికి వెళుతున్నారట. దీనితో ఈ డివోషనల్ సినిమా పట్ల వారు చూపిస్తున్న భక్తి, గౌరవం ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న శనివారమే 10 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న సినిమా కేవలం హిందీ వెర్షన్ లోనే ఏకంగా 50 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. వచ్చిన మొత్తం 79 కోట్ల గ్రాస్ లో దాదాపు హిందీ వెర్షన్ నుంచే రావడం విశేషం.

Exit mobile version