మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలోనే రెండు భారీ అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌తో పాటు ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే చేయబోతున్నారట మేకర్స్. ఇక ఈ సినిమాలో చిరు పాత్ర అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.