ఎన్టీఆర్-నీల్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు

tavino-thomos-prudhvi-raj

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్-నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి.

అయితే, ఈ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఓ పకడ్బందీ స్క్రిప్టును రెడీ చేశాడని.. ఈ కథలో చాలా పాత్రలు ఉంటాయని.. అందులో రెండు ముఖ్యమైన పాత్రల్లో టొవినో థామస్, బిజు మీనన్ నటిస్తున్నారని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు.

దీంతో టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇక అధికారం అయినట్లే అని చెప్పాలి. మరి ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రతో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version