‘వార్ 2’ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్!

war2 movie

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో బ్రహ్మాస్త్రం దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రమే “వార్ 2”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో ఉన్న అంచనాలు మరింత అయ్యాయి. యాక్షన్ సినిమా లవర్స్ కి క్రేజీ ట్రీట్ ని ప్రామిస్ చేసిన ఈ ట్రైలర్ ఇపుడు భారీ రెస్పాన్స్ ని మూడు భాషల్లో సొంతం చేసుకుంది.

హిందీ, తెలుగు సహా తమిళ్ లో విడుదల అయ్యిన ఈ ట్రైలర్ ఏకంగా 90 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని అదరగొట్టింది. ఇక నెక్స్ట్ నుంచి మేకర్స్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అలాగే పాటలు కూడా ఇంకా రావాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఒక రోజు ముందే రిలీజ్ కి రానుంది.

Exit mobile version