టాలీవుడ్‌లో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ‘కోర్ట్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా కోలీవుడ్‌లో రీమేక్‌కు సిద్ధమవుతోంది. తమిళ దిగ్గజ యాక్టర్-డైరెక్టర్ త్యాగరాజన్ ఈ చిత్ర హక్కులను దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో ప్రశాంత్ లీడ్ రోల్‌లో కృతిక్, ఇనియా ఇతర ముఖ్య పాత్రల్లో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, కోర్ట్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉండటంతో ఇప్పుడు ఈ రీమేక్‌తో మేకర్స్ రిస్క్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.