యూఎస్ ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో ‘కింగ్డమ్’ ర్యాంపేజ్ షురూ!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి యూఎస్‌లో టికెట్ బుకింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ చిత్రం అక్కడ ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే ఏకంగా 100K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.

రిలీజ్‌కు వారం రోజులు ఉండగానే ఈ సినిమా ర్యాంపేజ్ షురూ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version