ప్రేమ కధా చిత్రాన్ని మెచ్చుకున్న దర్శకధీరుడు

rajamouli-latest
గత వారాంతరంలో విడుదలై సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ‘ప్రేమ కధా చిత్రమ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర దుసుకెల్తుంది. యూత్ మరియు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. నలుగురి పాత్రలు చుట్టూ తిరిగే ఈ హర్రర్ కామెడికు ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. మారుతి కధ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ విభాగాలను చూసుకున్నాడు. జె.బి సంగీతం అందించాడు.

ఇప్పుడు ఈ సినిమాకు రాజమౌళి రూపంలో మరో అభిమాని జత కలిసాడు. ఈ సినిమాను చుసిన ఆయన ఇలా అన్నారు ” ‘ప్రేమ కధా చిత్రమ్’ కు వెళ్లాను. బాగా ఎంజాయ్ చేసాను. 1.8 కోట్లతో తీసారని తెలిసింది. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద విజయం సాదించింది. అందరికీ నా శుభాకాంక్షలు” అని ట్వీట్ చేసాడు. సూపర్ స్టార్ కృష్ణ మరియు మరికొంత మంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. వీళ్ళందరి మెప్పులను పొందుతున్న ఈ సినిమా బృందం పరమానందంలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాలా??

Exit mobile version