కార్తికేయగా కలిసి రానున్న నిఖిల్, స్వాతి

Nikhil-and-Swathii
‘స్వామి రా రా’ సినిమా విజయం సాదించిన తరువాత నిఖిల్ స్వాతి మరోసారి జత కట్టనున్నారు. ఈ కొత్త సినిమా పేరు ‘కార్తికేయ’. చందూ మొందేటి దర్శకుడు. మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్
పై వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు లింగుస్వామి, సుధీర్ వర్మ, పరశురాం హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “‘స్వామి రారా’ విజయం తరువాత చాలా స్క్రిప్ట్లి విన్నాను. వాటిల్లో చందూ స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. స్క్రిప్ట్ పై దర్శకుడికి, నిర్మాతకు ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాకు సంతకం చేసాను. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరునుండి మొదలవుతుంది. ఈ సినిమా మొత్తం ఒక గుడి చుట్టూ తిరుగుతుంది. షూటింగ్ లో చాలా భాగం వైజాగ్, అరకు మరియు భీమేశ్వర స్వామి ఆలయంలో ఉంటుందని”అన్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు

Exit mobile version