ఓటిటి సమీక్ష: ‘నగుమోము కనలేని’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

OTT Nagumomu-Kanaleni Movie Review

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 20, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : తనికెళ్ల భరణి, శరణ్య శర్మ, ఇందుమతి, రాజాచెంబోలు, ఫణిప్రకాష్, నేహాల్
దర్శకత్వం : అనురాధ
నిర్మాత : డాక్టర్ గౌతమ్ కశ్యప్
సినిమాటోగ్రఫీ : బాల సుబ్రహ్మణ్యం
సంగీతం : విక్రమ్ సెల్వ, రిషి
ఎడిటర్ : జిజేంద్రన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో కథా సుధ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ప్రతీ వారం వస్తున్న కొత్త ఎపిసోడ్స్ గత రెండు మూడు వారాలు వాయిదా పడ్డాయి. ఇపుడు వచ్చిన కొత్త ఎపిసోడ్ నే “నగుమోము కనలేని”. సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి నటించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే అమ్మాయి అమంతా (శరణ్య శర్మ)కి తన తండ్రి (తనికెళ్ళ భరణి) అంటే ఎంతో ప్రేమ. తన తండ్రి కూడా ఆమెలో తన అమ్మని చూసుకుంటారు. ఇంత ప్రేమ ఉన్న వీరి మధ్య జరిగిన విషాద ఘటన ఏమిటి? దాని తర్వాత అమంతా పరిస్థితి ఏంటి? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో కనిపించిన యువ నటి శరణ్య చాలా బాగుంది. చబ్బీ లుక్స్ లో అందంగా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మంచి పెర్ఫామెన్స్ ని అందించింది. కామెడీ, ఎమోషన్స్ అన్ని బాగా చేసింది. అలాగే సీనియర్ నటులు తనికెళ్ళ భరణి మరోసారి తన మార్క్ నటన చూపించారు.

కూతురు అంటే వల్లమాలిన ప్రేమ ఉన్న తండ్రిగా ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కదిలిస్తారు. అలాగే శరణ్యతో సీన్స్ కూడా బాగున్నాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఆడియెన్ ని కదిలిస్తుంది. ఇక వీరితో పాటుగా రాజా చెంబోలు తన పాత్రలో సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

గత ఎమోషనల్ ఎపిసోడ్స్ తో పోలిస్తే కథా సుధలో ఈ ఎపిసోడ్ బాగా వీక్ అని చెప్పొచ్చు. మొత్తం 36 నిమిషాల నిడివిలో పెద్దగా ఎంగేజ్ చేసే అంశాలు కనిపించవు. ఒక 20 నిమిషాలు దాటే సన్నివేశాలు మొత్తం చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ తండ్రీ కూతుళ్ళ కథలానే కనిపిస్తుంది.

సో ఈ ఎపిసోడ్ ఏమంత కొత్తగా అనిపించదు. అలాగే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ టచ్ తర్వాత దానిని జస్టిఫికేషన్ చేసే విధానం కూడా ఇంకా బెటర్ గా ట్రై చేయాల్సింది. అమంతా లైఫ్ లో జరిగిన ఒక ఊహించని ట్రాజడీకి ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చకపోవచ్చు. ఆ ఒక్క ఎమోషనల్ బిట్ తప్ప మిగతా ఎపిసోడ్ లో కథనం అంతా చాలా సింపుల్ గా ఫ్లాట్ గా సాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ తాలూకా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ నీట్ గా ఉంది. విక్రమ్ సెల్వ, రిషిలు ఇచ్చిన బిట్ సాంగ్, స్కోర్ లు బాగున్నాయి. బాల సుబ్రహ్మణ్యం ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. జిజేంద్రన్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. రొటీన్ సీన్స్ ని కట్ చేస్తే బాగుణ్ణు.

ఇక దర్శకురాలు అనురాధ విషయానికి వస్తే.. ఆమె చాలా సింపుల్ లైన్ నే తీసుకున్నారు. కానీ ఇందులో ఒక కదిలించే ఎమోషనల్ బ్లాక్ ని పెట్టుకున్నారు కానీ ఓవరాల్ గా ఇదేమి అంత ఇంపాక్ట్ కలిగించలేదు. మహా అయితే ఐదు నిమిషాల కోసం మిగతా మొత్తం సాగదీశారు. సో తన వర్క్ మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది.

తీర్పు:

ఓవరాల్ గా చూస్తే ఈ ‘నగుమోము కనలేని’ లఘు చిత్రం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ కథా సుధలో ఒక డల్ ఎపిసోడ్ అని చెప్పాలి. చాలా ఫ్లాట్ గా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేకుండా ఈ ఎపిసోడ్ సాగింది. మధ్యలో ఒక్క దగ్గర ఎమోషనల్ బ్లాక్ తప్ప మిగతా అంతా చాలా రొటీన్, రెగ్యులర్ గా ఉంది. సో ఈ ఎపిసోడ్ ని స్కిప్ చేసేసినా పర్వాలేదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version