‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేది ఆరోజే!?

Kingdom

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ట్రైలర్ పై లేటెస్ట్ న్యూస్ తెలుస్తోంది.

దీని ప్రకారం ట్రైలర్ ఈ జూలై 25న విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ ఆరోజున ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version