అఫీషియల్: నైజాంలో పవర్ స్టార్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది వీరే!

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒకింత టెన్షన్ వాతావరణం కూడా కనిపించింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ ఏమో కానీ దానికి ముందు కొన్ని చిక్కులు బాగా టెన్షన్ పెట్టాయి. ముఖ్యంగా నైజాం రిలీజ్ లో అసలు సమస్య వచ్చింది.

అనుకున్న సంస్థకే నైజాం హక్కులు

అయితే నైజాం మార్కెట్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు చేస్తున్నారని వార్తలొచ్చాయి. మరి ఫైనల్ గా దీనిపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చేసారు. అఫీషియల్ గా అనౌన్స్ చేసి తెలంగాణ మాత్రం గ్రాండ్ గా వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ ఎక్కువ షోస్ తో రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేసేసారు.

వీరమల్లు కి రూట్ క్లియర్ అయినట్టేగా

నైజాం మార్కెట్ లో నిర్మాత సొంతం రిలీజ్ అనే మాట నుంచి ఇపుడు మైత్రి సంస్థ గ్రాండ్ రిలీజ్ అనే అనౌన్స్మెంట్ తో వీరమల్లు ఆగమానాంకి ఎలాంటి అడ్డు లేదని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు జ్యోతికృష్ణ వర్క్ చేయగా కీరవాణి సంగీతం అందించారు అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version