పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. ఎట్టకేలకి ఐదేళ్ల తర్వాత విడుదల అవుతున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ నుంచి ఏ సినిమా కూడా సాఫీగా విడుదల జరగలేదు. ఇప్పుడు ఇలానే వీరమల్లుకి కూడా చివరి నిమిషం చిక్కులు తప్పలేదు.
అయితే నైజాంలో రిలీజ్ కి ముందు డిస్ట్రిబ్యూటర్స్ ఏ ఎం రత్నం గత సినిమాల డబ్బులు సెటిల్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ మెట్లెక్కారు. అయితే నైజాంలో ఇబ్బంది అవ్వొచ్చు అని అంతా అనుకున్నారు కానీ రంగంలోకి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు దిగినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది మేకర్స్ ఊరట అని చెప్పవచ్చు. అలాగే నైజాంలో సాలిడ్ రిలీజ్ ఈ చిత్రానికి కూడా దక్కుతుంది అని చెప్పవచ్చు.