మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం వార్-2 కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బడా బ్యానర్ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఇది తొలి స్ట్రెయిట్ మూవీ. దీంతో ఈ సినిమాపై సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా భారీ హైప్ క్రియేట్ చేసుకుంది.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించి అనేక విషయాలపై చర్చ సాగుతోంది. అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉండబోతుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. దీనిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 30 నిమిషాలు తప్ప సినిమా మొత్తం ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
దీంతో వార్-2 సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.