కట్టప్ప బాహుబలిని చంపకపోతే.. అందరి కళ్ళు దీనిపైనే

baahubali

భారతీయ సినిమా దగ్గర అతి పెద్ద ప్రశ్న.. ఒక సీక్వెల్ సినిమాకి కనీ వినీ ఎరుగని హైప్ ని సెట్ చేసిన ప్రశ్న ఏదన్నా ఉంది అంటే అది ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’?. ఈ ఒక్క ప్రశ్నతో బాహుబలి 2 సినిమాపై అంచనాలు ఆకాశంలోకి వెళ్లాయి. అయితే అసలు కట్టప్ప బాహుబలిని చంపకుండా ఉంటే? ఇదే రీసెంట్ గా మేకర్స్ నుంచి వచ్చిన మరో ఆసక్తికర ప్రశ్న.

గ్రాండ్ గా అక్టోబర్ ఎండింగ్ లో బాహుబలి ది ఎపిక్ గా రెండు భాగాలని కలిపి రిలీజ్ కి సిద్ధం చేసిన మేకర్స్ ఆల్రెడీ దీనికి కూడా సాలిడ్ ప్రమోషన్స్ ని షురూ చేశారు. ఇలా బాహుబలిని కట్టప్ప చంపకుండా ఉంటే ఏంటి? అనే ప్రశ్నకి సమాధానం నేడు ఇస్తున్నట్టు తెలిపారు. దీనితో ప్రస్తుతం అప్డేట్ కోసమే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు రివీల్ చేస్తామన్న సమాధానం ఎలా ఉంటుందో చూడాల్సిందే మరి.

Exit mobile version