శర్వానంద్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా ఆడియో వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుటుంబ విలువలను, ఎమోషన్స్ ని ప్రముఖంగా చేసుకొని ఈ కథని రూపొందించారు. అలాగే ఈ సినిమాలో తల్లి తండ్రులు పిల్లలపై పెట్టుకునే ఆశలు యువత పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే పాయింట్ ని ఈ సినిమాలో చూపించనున్నారు. చేరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్రవంతి రవికిషోర్ నిర్మాత. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగాన్ని శ్రీ కాళహస్తి, చెన్నై, గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరించారు.