గార్భాశయ కాన్సర్ కోసం వాక్సిన్ వేసుకున్న సమంత

Samantha

ఒక స్టార్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీ ఏది చేసినా వారి ఫ్యాన్స్ పై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైనా ఓ మంచి పని చేస్తే చాలా మంది అదే దారిలో నవడానికి స్పూర్తిగా తీసుకుంటారు. ఇప్పటి వరకూ ఎంతోమంది సెలబ్రిటీలు పల్స్ పోలియో నుండి జంతువుల పరిరక్షణ హక్కు వరకూ గొప్ప గొప్ప కార్యక్రమాలకు నడుం బిగించారు. వారి దారిలోనే సమంత కూడా తనకి తగ్గట్టుగా ఓ మంచి పని చేసింది.

‘గర్భాశయ కాన్సర్ కి సంబందించిన చివరి వాక్సిన్ వేసుకున్నాను. అమ్మాయిలూ మీరు వేసుకొని, మీ కుటుంబంలోని వారందరికీ వాక్సిన్ వేయించండని’ సమంత ట్వీట్ చేసింది. ఇండియన్ మహిళల్లో బాగా కామన్ గా కనిపిస్తున్న కాన్సర్ గర్భాశయ కాన్సర్. దీనివల్ల ఇప్పటికే 77,000 మంది చనిపోయారు. సమంత లాంటి పాపులర్ నటి ఈ వ్యాధి గురించి చెబితే చాలా తొందరగా ప్రజలకి రీచ్ అయ్యి, ఎంతో మంది వాక్సిన్ వేసుకొని వారి జీవితాలను కాపాడుకునే అవకాశం ఉంది.

Exit mobile version