దర్శకుడిగా రెండవ సినిమాకి సిద్దమవుతున్న భరణి

Tanikella-bharani

విమర్శకులను మెప్పించే రైటర్, నటుడు తనికెళ్ళ భరణి తన రెండవ ఫీచర్ ఫిల్మ్ కి దర్శకత్వం వహించడానికి సిద్దమవుతున్నాడు. గత సంవత్సరం ఎస్.పి బాలసుబ్రమణ్యం – లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘మిధునం’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. ఈ సినిమా 2012లో విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇద్దరు ఓల్డ్ కపుల్ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఎలా సంతోషంగా గడిపారు అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఒక అర్థవంతమైన సినిమా తీసాడని తనికెళ్ళ భరణిని మెచ్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమలశెట్టి తనికెళ్ళ భరణి రెండవ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్న ఈ సినిమా పై అధికారిక ప్రకటన, వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version