‘రాజాసాబ్’ కోసం స్పెషల్‌గా వస్తున్న మిల్కీ బ్యూటీ..?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేశాయి.

అయితే, ఈ సినిమా నుంచి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని.. దీని కోసం పలువురు హీరోయిన్ల పేర్లు చిత్ర యూనిట్ పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్ అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమన్నా. అంతలా అమ్మడు అక్కడి స్పెషల్ సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకుంది.

ఇక తెలుగువారికి ఎంతో పరిచయం ఉన్న తమన్నా, ఇప్పుడు రాజా సాబ్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో వస్తుందనే వార్తతో మరోసారి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక గతంలో ప్రభాస్, తమన్నా రెబల్, బాహుబలి 1, బాహుబలి 2 వంటి చిత్రాల్లో కలిసి నటించారు. మరి నిజంగానే తమన్నా రాజాసాబ్ కోసం స్పెషల్ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version