మన దక్షిణాది సినిమా దగ్గర మంచు సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ప్రముఖ నిర్మాత ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు టచ్ చేసిన ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం కూడా ఒకరు. మావెరిక్ దర్శకుడు శంకర్ పీక్ ని చూపించింది కూడా ఈ నిర్మాత తోనే కావడం విశేషం. అయితే తన నిర్మాణంలో వచ్చిన “భారతీయుడు” అప్పట్లో రికార్డులు తిరగరాసింది. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ ని మాత్రం వీరి నిర్మాణంలో చేయలేదు.
ఒక రకంగా చేయకపోవడమే కొంచెం సేఫ్ అయ్యింది అని చెప్పొచ్చు. మరి ఒక సినిమా ఒకరితో సీక్వెల్ ఇంకొకరితో ఎలా అయ్యింది అనేది ఏ ఎం రత్నం రీసెంట్ గా రివీల్ చేశారు. భారతీయుడు 2 చేయకపోవడానికి కారణాల్లో నిర్మాణం అలాగే ఆర్టిస్టుల పరంగా మారిపోయిన ప్రమాణాల్లో కారణం ఒకటైతే మరో కారణం శంకర్ అప్పటికే నిర్మాణ సంస్థ లైకాతో మరో సినిమా చేయాలనే డీల్ ఉందట. దీనితో ఏదో సినిమానే ఎందుకు భారతీయుడు 2 నే చేద్దామని అనుకున్నారని అలా భారతీయుడు 2 వాళ్ళు చేసారని తెలిపారు హరిహర వీరమల్లు నిర్మాత.