‘పెద్ది’ జెట్ స్పీడ్.. అప్పుడే ఇంత షూట్ పూర్తి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ కెరీర్లో ఐకానిక్ హిట్ చిత్రం “రంగస్థలం” కి మించి దీనికి తాను ఎగ్జైటెడ్ గా ఉన్నాడు అనే మాటకే మెగా ఫ్యాన్స్ మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం లీడ్ నటీనటులతో శరవేగంగా కంప్లీట్ అవుతుంది.

ఇక ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. దీనితో సినిమా అప్పుడే ఏకంగా 55 శాతానికి పైగా కంప్లీట్ అయ్యిపోయిందట. మొన్న మార్చ్ నాటికి 30 శాతం మేర కంప్లీట్ అయ్యిన ఈ సినిమా ఈ గ్యాప్ లోనే మరో 30 శాతం దగ్గరకి వచ్చేసింది అని చెప్పాలి. ఇలా మొత్తానికి అయితే పెద్ది సినిమా జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version