ఇంటర్వ్యూ : నిర్మాత సతీష్ – ‘సోలో బాయ్’ ప్రతి ఒక్కరిలో కనిపించే క్యారెక్టర్..!

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నవీన్ కుమార్ దర్శకత్వంలో సతీష్ నిర్మాతగా జూలై 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం ‘సోలో బాయ్’. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. ‘సోలో బాయ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో చిత్ర నిర్మాత సతీష్ మీడియాతో ముచ్చటించారు.

‘సోలో బాయ్’ చిత్ర ప్రస్థానం ఎలా మొదలైంది?

‘సోలో బాయ్’ చిత్ర హీరో గౌతమ్ కృష్ణ నాకు చాలా మంచి స్నేహితుడు. అతను ఈ సినిమా లైన్ చెప్పినప్పుడు మధ్యతరగతి కుటుంబంలోని 17 సంవత్సరాల నుండి సెటిల్ అవ్వడానికి పడే కష్టం తాలూకా పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది.

ప్రొడక్షన్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?

అనవసరమైన ఖర్చులు ఎక్కడా పెట్టకుండా ప్రతి విషయంలో జాగ్రత్తపడి ఖర్చు పెట్టాము. చిత్రానికి పనిచేసిన యంగ్ టీం అంతా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా విడుదల తర్వాత వారికి లాభాల నుండి తగ్గ డబ్బును ఇస్తాను.

ప్రస్తుత సినిమాలపై, బయట మార్కెట్ పై మీ అభిప్రాయం?

గతంలో బట్టల రామకృష్ణ బయోపిక్ సినిమా తీసినప్పుడు ఒక ఎక్స్పరిమెంట్ లాగా చేశాము. అది మాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ సమయంలో నేర్చుకున్న వాటిని బేస్ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటూ సోలో బాయ్ సినిమా చేశాము. కానీ ప్రస్తుతం స్టార్స్ ఉన్న సినిమాలకు థియేటర్లు ముందుగానే బ్లాక్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ పై ఇంకా బ్యాలెన్స్ కాలేదు.

సినిమా రన్ టైమ్ ఎంత? ఎన్ని థియేటర్లలో విడుదల కానుంది?

ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునేప్పటికీ రెండు గంటల పది నిమిషాలు ఫైనల్ అవుట్ పుట్ వచ్చింది. U/A సర్టిఫికేట్ తో ఆంధ్ర తెలంగాణలో కలిపి సుమారు 120 నుండి 150 స్క్రీన్స్ మధ్యలో విడుదల కానుంది.

గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ ఫేమ్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుంది?

గౌతమ్ ఈ సినిమా ప్రమోషన్లలో 100% మంచి సపోర్ట్ ఇస్తున్నారు. బిగ్ బాస్ రెండు సీజన్లో ఉండటం వల్ల అతని ఫేమ్ ఈ సినిమాకు మరింత తోడ్పడుతుంది అనుకుంటున్నాను.

ఒక నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో గ్రహించింది ఏంటి?

సాధారణంగా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని తెలిసే వస్తాము. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఆశయంతో నిర్మాతగా వచ్చాను.

సోలో బాయ్ సినిమాను అనుకొన్న బడ్జెట్ లోనే పూర్తి చేశారా?

అనుకున్న బడ్జెట్ కంటే కొంత తక్కువలోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము.

రివ్యూస్ పై మీ ఒపీనియన్ ఏంటి?

మన సినిమాలో విషయం ఉంటే జనాల్లోకి వెళుతుంది. రివ్యూస్ ఎలా ఉన్నా కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే సినిమా విడుదలైన మూడు రోజులపాటు అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

సోలో బాయ్ సినిమాను ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు?

సోలో బాయ్ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. సొంతంగా కష్టపడి తన కాళ్ళ మీద తాను నుంచోవాలి అనుకుని ఆలోచనతో సాగే సినిమా. ప్రతి ఒక్కరిలో కనిపించే క్యారెక్టర్ సోలో బాయ్.

మీ తర్వాత సినిమాలు ఏంటి?

నార్నె నితిన్ తో ఒక సినిమా చేయబోతున్నాను. థ్రిల్లర్ జోనర్ లో కథ ఒకే అయింది.

Exit mobile version