“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.
– శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి వర్క్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా మాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు మా దగ్గరనే ఉన్నాడంటే అందుకు మా మధ్య ఉన్న రిలేషన్, వేల్ వెంగ్త్ కారణం. ఇండస్ట్రీలో డబ్బుతోనే పనులు జరుగుతుంటాయి. నాది భిన్నమైన పద్ధతి. నేను వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్లతోనే జర్నీ చేస్తుంటాను. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, దశరథ్.. ఇలా డైరెక్టర్స్ మా సంస్థలో వర్క్ చేసి హిట్ చిత్రాలు ఇచ్చారు. శ్రీరామ్ వేణు మా సంస్థలోనే ట్రావెల్ అవుతున్నాడంటే అతనికి భారీగా డబ్బు ఇవ్వడం వల్ల కాదు. మాతో ఆయనకు ఒక కంఫర్ట్ ఉంటుంది. అనిల్ రావిపూడితో నాకొక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ లో ఒక కంఫర్ట్ ఉంటుంది. ఈ డైరెక్టర్స్ టాలెంట్ నాకు తెలుసు. కాబట్టి కథ టైమ్ లో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాకు అనిపించినవి అడుగుతా. నేను క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తారు. అంతే గానీ వారి పనిలో ఇంటర్ఫియర్ కాను.
– “తమ్ముడు” మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్ గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఎ ఇస్తామని చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్ కు అంగీకరించాం. ఇది సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఎంటర్ టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం. తమ్ముడు మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న మూవీ. థియేటర్స్ కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 పర్సెంట్ మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్ లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు.
– పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్ తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్ కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు. నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్ కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్ గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్ తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్ గా చూడొద్దు.
– “తమ్ముడు” మూవీకి అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. మనమంతా కొత్త సినిమా కావాలనుకుంటాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్నిస్తా అన్నాడు. మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేయించాం. శుక్రవారం మార్నింగ్ షో చూసిన మీ అందరికీ మా సినిమా నచ్చితే సూపర్ హిట్ దక్కినట్లే. కథగా చూస్తే ఇది సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది మూవీలో చూస్తారు. ఈ కథను స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్ తో వెళ్తూ ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు.
– నిర్మాతగా సినిమాను బాగా రెడీ చేసి ప్రాపర్ గా రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. వారికి నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు డైరెక్టర్ అనిల్ బాగా ప్లాన్ చేసి ప్రేక్షకులకు మూవీ రీచ్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా మేము అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. తమ్ముడు రిజల్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాం, అయితే ఎంత రేంజ్ హిట్ అవుతుంది అనేది మాత్రం రిలీజ్ రోజునే తెలుస్తుంది. ఫలానా ఓటీటీ సినిమాను తీసుకుంది అని ముందే ప్రకటించడం ఆపేస్తే మంచిది. ఓటీటీలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. తమ్ముడు మూవీ కంటెంట్ కు వస్తున్న వ్యూస్ విషయంలో జెన్యూన్ గా ఉంటున్నాం.
– ఎఫ్డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్ లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి ప్రొడక్షన్ లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్ లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్ తో ఒక సినిమా ఉంటాయి. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. యానిమల్ తో ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్ లో రెండు మూడు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. ఎలాంటి కంటెంట్ తో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది డిస్కస్ చేస్తున్నాం.