ఇలియానా, తమన్నా లు బాలీవుడ్ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం మనదరికి తెలుసు. తమన్నా నటించిన మొదటి సినిమా ఫ్లొప్ అవ్వడం, అలాగే ఇలియానా మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాదించాయి. కానీ తమన్నా అంతటితో ఆగిపోకుండా ఆమెకి బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే ఇలియానా కూడా మంచి హై సక్సెస్ లో ముందుకు వెళ్తోంది. ఇలియానా ప్రస్తుతం షహీద్ కపూర్, సైఫ్ ఆలీఖాన్ రెండు సినిమాలలో నటిస్తోంది. తమన్నా మాత్రం కేవలం అక్షయ్ కుమార్ సినిమాలో మాత్రమే నటిస్తోంది. అలాగే ఇలియానా ఇప్పటికే మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేశారని తమన్నా కన్నా లీప్ లో ఉందని సమాచారం. ఏది ఏమైనా వారిద్దరూ బాలీవుడ్ లో తమ హవని కొనసాగిస్తున్నారు.