మరో ప్రముఖ కంపెనీకు ప్రచారకర్తగా మహేష్ ఎన్నికయ్యాడు. నిన్న హైదరాబాద్లో జరిగిన వేడుకలో మన సూపర్ స్టార్ టి.వి.ఎస్ మోటార్ బైక్ లకు కొత్త ప్రచారకర్తగా మారాడు. “100 ఏళ్ళ చరిత్ర వున్న టి.వి.ఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం నాకు లభించిన ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నాను. వీరితో ఎక్కువకాలం నా భంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని”తెలిపాడు. అనంతరం మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ “ముందు నేను బ్రాండ్ ను, వాటి సిద్ధంతాన్ని నమ్మాలి. అప్పుడే నేను ప్రచారకర్తగా ఉండడానికి ఆలోచిస్తాను”అని అన్నాడు.
చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత తెలుగు సినిమాలో ఖాళీగా వున్నా నెంబర్ 1 స్థానంపైన మీ గురి ఉందా అన్న ప్రశ్నకు మహేష్ బాబు సమాధానమిస్తూ “నేనెప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు. ప్రతీ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. నిజానికి ఈ నెంబర్ గేమ్ లను నేను నమ్మను. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది యువహీరోలు అద్బుతంగా నటిస్తున్నారు. వారి ద్వారా గట్టి పోటీ ఎదురుకానుంది. కానీ వీటన్నిటికంటే ముందు నాకు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానం దక్కించుకోవాలన్న ఆశ, ఆలోచన ఎన్నడూ లేదని” తెలిపాడు. అతను సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న’1′ సినిమా గురించి ఉత్సాహంగా ఎదురుచుస్తున్నాడని అన్నాడు. “ఈ సినిమా కధకు ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుంది , అంతేగానీ వేరే ఏ ఇతర ఉద్దేశం లేదు. ఆ విషయం సినిమా చూసాక మీకే తెలుస్తుందని” చెప్పాడు. ఈ సినిమా కోసం త్వరలో లండన్ వెళ్లనున్నాడు. కృతి సనన్ హీరొయిన్. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు