బాలీవుడ్‌లో గ్రీక్ గాడ్‌గా తనకంటూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న స్టార్ హీరో హృతిక్ రోషన్ నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా దాని కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ హీరో నటించే సినిమాలకు కేవలం హిందీలోనే కాకుండా యావత్ భారత్‌లో సాలిడ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఈ హీరో తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్‌తో కలిసి నటిస్తున్న ‘వార్-2’ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలో హృతిక్ రోషన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కొలాబరేషన్‌ను ప్రకటించాడు. సౌత్ ఇండియాలో కన్నడతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న భారీ చిత్రాల సంస్థ హొంబాలే ఫిలింస్ త్వరలో తెరకెక్కించబోయే ఓ భారీ ప్రాజెక్ట్ కోసం హృతిక్ రోషన్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని తెలిపింది.
దీంతో ఈ కొలాబొరేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందా.. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను గల్లంతు చేస్తుందా.. అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ కాంబో కేవలం ప్రకటనతోనే ఇండియన్ సినిమాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.