లక్ష్మి మంచు మరియు తాప్సీ జూన్ 7న హైదరాబాద్లో ర్యాంప్ పై నడవనున్నారు. ప్యాషనబల్ ఫౌండేషన్ హైదరాబాద్లో ప్రభుత్వ పాటశాలలో చదువుతున్న పిల్లలకు గానూ నిధులు సమకూర్చడానికి ఈ ఫాషన్ షోను నిర్వహించారు. ఫిట్నెస్ స్పెషలిస్ట్, డిజైనర్ అయిన మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి తాను ప్రదర్శించిన కలెక్షన్ కు ‘వెన్ రెయిన్బో ప్లేయ్డ్ ఇట్స్ నోట్స్ ఆఫ్ సింఫనీ’ అని పేరు పెట్టింది. మంచు లక్ష్మి, తాప్సీ కాక ప్రియమణి, శ్రియ, షమిత శెట్టి, మధురిమ బెనర్జీ మరియు రాజకీయ రంగంనుండి పురందరేశ్వరి, జయప్రద, డి.కె అరుణ ర్యాంప్ పై నడవనున్నారు.