RAPO22: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. అదిరిన గ్లింప్స్

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. అనౌన్స్ చేసినప్పుడు నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నుంచి సాలిడ్ టైటిల్ ని గ్లింప్స్ ని నేడు మేకర్స్ రామ్ బర్త్ డే కానుకగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా ఓ గంట ఆలస్యం తర్వాత ఫైనల్ గా అవైటెడ్ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసేసారు. మరి ఈ గ్లింప్స్ మాత్రం రామ్ నుంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఒక స్టార్ హీరో కొత్త సినిమా రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ దగ్గర నడిచే రచ్చని ప్రెజెంట్ చేస్తూ ఆరోజు టికెట్ కౌంటర్ లో ఉండేవారికి టికెట్స్ కోసం వచ్చే కాల్స్.. వారి తాలూకా వీరి తాలూకా నుంచి హీరో ఫ్యాన్స్ తాలూకా వరకు మంచి ఎంగేజింగ్ గా ఈ గ్లింప్స్ ఉందని చెప్పాలి.

మరి రామ్ తన లుక్స్ అండ్ ఎనర్జీతో అదరగొట్టగా తాను ఎవరి ఫ్యాన్ అనే సస్పెన్స్ తో దానిని హీరో ఉపేంద్రని రివీల్ చేయడం మరింత ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పాలి. అలా “ఆంధ్రా కింగ్ తాలూకా” అంటూ రివీల్ చేసిన టైటిల్ తో సాలిడ్ హిట్ వైబ్స్ ఈ సినిమాకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ గ్లింప్స్ లో వివేక్ – మెర్విన్ లు ఇచ్చిన స్కోర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వగా మహేష్ బాబు నుంచి మరో సాలిడ్ సినిమా పడేలా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా రిలీజ్ పై మున్ముందు క్లారిటీ రానుంది.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version