కీరవాణి తెలియజేసిన 10 రకాల క్లాసిఫైడ్ సింగర్స్

Keeravani

సినీ ఇండస్ట్రీలో అందరు ప్రశంసించే, గౌరవించే మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తరువాత సంక్లిష్టమైన వాయిద్యాలను ఉపయోగించడం, మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో కీరవాణి గారే అని అందరు అంటూ ఉంటారు. ఈ రోజు కీరవాణి గారు ఆయన ట్విట్టర్ లో కొన్ని ముఖ్యమైన విషయాలను పోస్ట్ చేశారు. అయన 10 మంది క్లాసిఫైడ్ సింగర్స్ గురించి తెలియజేశాడు. ఆయన తెలియజేసిన ఆర్డర్ లో ఈ లిస్టుని మీకోసం క్రింద ఇవ్వడం జరిగింది. కీరవాణి గారు ఎలా ట్వీట్ చేశారో అలాగే మీకు అందజేస్తున్నాము.

10. గంధర్వులు – ఒకే ఒక్కడు – ఎస్.పి బాలసుబ్రమణ్యం

9. శ్రామిక జీవులు – శ్రామికులు శారీరక శ్రమని మరిచిపోవడానికి పాటలు పాడేవారు.

8. అమృత కళశాలు – (వాయిస్) పాలలాంటి, తేనెలాంటి వాయిస్ కలవారు.

7. పుంభావ సరస్వతులు – సామాన్య మానవుని మనసును దాటి పాటను పాడేవారు – ఉదా. మంగళంపల్లి బాలమురళికృష్ణ

6. గణిత శాస్త్రజ్ఞులు – ప్రముఖ శాస్త్రీయ గాయకులు.

5.గుంపులో గోవిందులు – కోరస్ పాడేవారు. వీరు ఒకరోజు సోలో సింగర్స్

4. వన్య ప్రాణులు – హై లెవల్ పిచ్, హై లెవెల్ బేస్ తో గొంతును సవరించి పాడేవారు.

3. సన్యాసులు – మంచి బ్యాగ్ గ్రౌండ్ పాటలు, చాలా తక్కువగా ప్రేమ పాటలు పాడేవారు. – ఉదా. ఎమ్.ఎమ్ కీరవాణి

2. నరులు – మొత్తం మనవ జీవితంలో కానీసం ఒక్క పాటైనా పాడినవారు.

1. అమరులు – మరణించిన తరువాత కూడా తన గానంతో జీవించి ఉన్న వ్యక్తి – ఉదా. ఘంటసాల గారు

Exit mobile version